Thursday, December 14, 2017

December Devotions

14 Dec 2017

కీడును మనము అనుభవింపతగదా

యోబు 2: 10 అందుకతడు మూర్ఖురాలు మాటలాడు నట్లు నీవు మాటలాడు చున్నావు; మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు.

మనలో అనేక మందిమి, మన ప్రార్థనలకు  మనము ఊహించిన విధముగా దేవుడు జవాబు ఇచ్చినట్లయితే ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతాము కాని అలానే ఒక వేళ వ్యాధి లేదా శ్రమలు వస్తే మాత్రము చాలా దిగులుతో నిరాశ పడిపోతాము. ఈ రోజు వాక్య భాగము లో యోబు తన భార్యను తిరిగి ప్రశ్నించు చున్నారు అసలు చెప్పాలంటే ఆమెకు సమాధానము చెబుతున్నారు మనము దేవుని వద్ద నుండి ఆశీర్వాదాలు మాత్రమే కాదు శ్రమలు కూడా స్వీకరించాలి అని. వాక్యము యొక్క సందర్భాన్ని చూసినట్లయితే యోబు యదార్థవంతుడు, న్యాయవంతుడు మరియు దేవుని యందు భయ భక్తులు కలిగిన వ్యక్తి. దేవుడు తన భక్తుడు నిజముగానే  యదార్థవంతుడు, న్యాయవంతుడు అని నిరూపించడానికి ఆయన సాతానుకు యోబును పరీక్షించడానికి అనుమతినిచ్చారు. అందుకే పరీక్షలో భాగముగా సాతాను తన పిల్లలను మరియు ఆస్తిని తీసుకున్నప్పుడు కూడా యోబు దేవునిని స్తుతించెను మరియు ఆయన దేవుడు అన్యాయము చేసేనని చెప్ప లేదు. తరువాత సాతాను దేవుని వద్ద నుండి అనుమతి పొంది యోబుకు తల నుండి అరికాలు వరకు బాధ గల కురుపులతో మొత్తెను మరియు దాని వలన యోబు బూడిదలో కూర్చుండి ఒక చిల్ల పెంకుతో ఒళ్ళు గోకు కొనవలసి వచ్చినది. అతని బాధ చూసిన అతడి భార్య దేవునిని దూషించి మరణించమని అనెను యోబు గ్రంథము 1 మరియు 2 అధ్యాయములు . దానికి జవాబుగా యోబు దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. యోబు తన బాధలు, శ్రమలు  మరియు వ్యాధిలో కూడా దేవునిని స్తుతించుటయే ఎంచుకొనెను.

దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో కూడా ఈ ప్రశ్న వేస్తున్నారు. మీ సంగతి తెలియదు కాని నాకయితే దేవుడు నా జీవితంలో అనుమతించే కొన్ని విషయాలు స్వీకరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా దేవుడు నాకు ఒక వాగ్ధానం ఇచ్చినప్పుడు అది ఎలా జరగాలో ఎప్పుడు జరగాలో ముందు గానే ఊహించుకోవడం మొదలు పెడతాను మరియు అది ఆ విధంగా జరగనప్పుడు బాధ పడి, నిరాశ చెందుతాను మరియు దేవుని మీద కోపం తెచ్చుకుంటాను. అయితే దేవుడు తన మహా కృపను బట్టి మృదువుగా *యిర్మియా 29: 11 ​నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.ని గుర్తు చేస్తారు. 

అవును ప్రియమైన వారలారా, దేవుడు మన పట్ల ప్రణాళిక మరియు ఉద్దేశము కలిగి ఉన్నారు కొన్ని సార్లు మనకు అలా అనిపించక పోయినప్పటికీ కూడా. మనము విధేయతతో మన జీవితాన్ని ఆయనకు సమర్పించు కున్నట్లయితే అప్పుడు వాటిని ఆయన మన జీవితంలో నెరవేరుస్తారు. అయితే ఆ నెరవేర్చే ప్రక్రియ పూలబాట మాత్రము కాదు కాని పూలు మరియు ముళ్ళు కలగలిసిన బాట. దారిలో ఆయన మనము ఊహించని ఆశీర్వాదాలతో ఆశ్చర్యపరుస్తారు మరియు  ఆశించని  శ్రమల ద్వారా మనలను శుద్ధి పరుస్తారు. అయితే అన్నిటిలో కూడా సమస్తమును మన మేలు కొరకు జరగిస్తారు రోమీయులకు 8:28 మీరు ఒక వేళ సంతోష సమయములో ఉన్నట్లయితే దేవునిని స్తుతించండి ఆయన ఆశీర్వాదము కొరకు మరియు ఆయన మీ పట్ల కలిగిన కటాక్షము కొరకు. ఒక వేళ మీరు కనుక వ్యాధి బాధల గుండా వెళ్తున్నట్లయితే అప్పుడు కూడా స్తుతించండి ఆయన దానిని మన మేలుగా మార్చునని. శ్రమలు మరియు బాధల ద్వారా ఆయన మనలో ఓర్పును మరియు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నారు రోమీయులకు 5:3,4. అందుకనే శ్రమలలో మనము దేవునిని మరి ఎక్కువగా స్తుతించాలి. 

ఇది గుర్తుంచుకొనండి, క్రిస్టమస్ యొక్క అంతిమ ఉద్దేశము సిలువ అలానే క్రిస్టమస్ లేకుండా సిలువ ఉండదు. కారణము లేని సమయము లేదు మరియు సమయము లేకుండా ఏ కారణము లేదు (No season without reason and no reason without season)

Have a blessed Christmas season  🌟🎄🎁

No comments:

Post a Comment